🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 September 2026, 8:30 pm Posted by : SAMAJA HITHAM

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల వంటావార్పు కార్యక్రమం!

News Image
పెద్దపల్లి జిల్లా, సెప్టెంబర్ 04 (సమాజహితం) : అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలైన కేటీఆర్ హరీష్ రావులు అడిగే ప్రశ్నలకు దమ్ము ధైర్యం లేక మొహం చాటేస్తుంటే ఇక్కడ మంత్రి అడ్డూరి మాత్రం సవాళ్లు విసరడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొప్పుల కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంట వార్పు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పై పలు విమర్శలు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారి పక్కనే ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల మీడియాతో మాట్లాడుతూ మంత్రి అడ్డూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రతిపక్ష నాయకులైన  హరీష్ రావు, కేటీఆర్ లు అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు సమాధానం చెప్పలేక మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మంత్రి అడ్లూరి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కితావ్ పలికారు.
🏠 Home