🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 04 September 2026, 9:18 pm Posted by : SAMAJA HITHAM

'లీసా’ సినిమా షూటింగ్ పూర్తి

News Image
ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సతీష్ రెడ్డి మాసం ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చి, సహ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. ‘ఎస్సార్ కళ్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. పులి రాకేష్ గౌడ్, కె. నరసింహులు, బనడ్ల శ్రీపతి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.
కథ నచ్చడం తో ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిచడానికి సుముఖంగా ఉన్నారు , ఇది సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. కూర్గ్, విరాజ్‌పేట, పెంచలకోన పరిసర ప్రాంతాల్లోని అద్భుతమైన లొకేషన్లలో అత్యున్నత నిర్మాణ విలువల (రిచ్ ప్రొడక్షన్ వేల్యూస్) తో భారీ స్థాయిలో ఈ సినిమాను చిత్రీకరించారు.
ఇటీవలే ‘లీసా’ షూటింగ్ విజయవంతంగా పూర్తయింది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాతలు మాట్లాడుతూ: “మా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చూసిన రషెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి, చిత్ర బృందం మొత్తం ఔట్‌పుట్ పట్ల ఎంతో నమ్మకంతో ఉంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘లీసా’ తెరకెక్కింది. ఇది ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందనే నమ్మకం ఉంది.
సినిమా మేకింగ్, అనన్య నాగళ్ల అద్భుతమైన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబర్ నెలలో సినిమాను ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని తెలిపారు.

నటీనటులు: అనన్య నాగళ్ల, అల్లాల రవిరెడ్డి గారు, సుమన్, మూసా అలీ ఖాన్, రత్నాకర్ రెడ్డి, జబర్దస్త్ సత్యశ్రీ, గడ్డం నవీన్, ఆకెళ్ల, రవిరెడ్డి, స్వప్న చౌదరి, గోపీ కార్తికేయ, సుజాత, సుజి, మానస, శ్యామ్, వెన్ని, జాను వర్మ, కనకం వెంకట్, బేబీ ట్వింకిల్, హనుశ్రీ తదితరులు.
🏠 Home