🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 11 September 2026, 1:02 am Posted by : SAMAJA HITHAM

ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

News Image
జగిత్యాల, సెప్టెంబర్ 10 ( సమాజహితం ) : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల భవన నిర్మాణ పనులను, అర్బన్ కాలనీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని పరిశీలించి నిర్మాణంలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ భవనాలు కీలకమని, నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నాణ్యమైన సామగ్రిని ఉపయోగించాలని స్పష్టం చేశారు. ప్రతి దశలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టి పనుల నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. నిర్మాణ పనులను పూర్తి స్థాయిలో చేసి త్వరలో భవనాలను ప్రారంభించి, వినియోగంలోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో మెట్ పల్లి ఆర్డీవో నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రి సూపరిండెంట్, తహసీల్దార్ ముక్తార్ పాషా, ప్రభుత్వ వైద్యశాల అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home