🏠 www.samajahitham.com
Watermark
Newspaper Logo
Date of Publish : 11 September 2026, 6:27 pm Posted by : SAMAJA HITHAM

కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ఆందోళన!

News Image
కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ఆందోళన!

వివాదాస్పదంగా మరీనా 'మట్టి ప్రతిమల' తరలింపు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి మెట్‌పల్లికి తరలిస్తున్న మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్‌ చెత్త తరలింపు వాహనంలో తరలించడంపై కలెక్టరేట్ లో బీజేపీ నేతల ఆందోళనకు దారితీసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగిత్యాల కలెక్టరేట్‌ నుంచి పంపిణీ చేసిన మట్టి వినాయక విగ్రహాలను మెట్‌పల్లికి తరలించే క్రమంలో మున్సిపల్‌ చెత్త తరలింపు వాహనాన్ని వినియోగించడం ఈ వివాదానికి దారితీసింది. చెత్త తరలించే వాహనంలో విగ్రహాలను తరలిస్తున్న దృశ్యాన్ని బీజేపీ నాయకులు గమనించి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నాయకులు జగిత్యాల కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు దిగారు. వినాయక విగ్రహాలను తరలించేందుకు చెత్త వాహనాన్ని ఉపయోగించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారుల తీరును ప్రశ్నించారు. విగ్రహాల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక వాహనంలో తరలించాల్సి ఉండగా చెత్త వాహనాన్ని వినియోగించడం సరికాదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.
🏠 Home