NSUI తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోట దుర్గరాజ్..సన్మానించిన జువ్వాడి నరసింగా రావు!
జగిత్యాల (సమాజహితం ప్రతినిధి) సెప్టెంబర్ 12: ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కోట దుర్గరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జువ్వాడి భవన్ లో శుక్రవారం కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ, కోట దుర్గారాజ్ యువ నాయకుడుగా పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఉన్నత స్థానంలో ఉండాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్ణాకర్ రావు, వెంకట్ రెడ్డి, అందే మారుతి, శ్రీనివాస్ రావు, ప్రవీణ్ కుమార్, పుప్పాల నగేష్, గంగారెడ్డి, జగన్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.