🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 September 2026, 10:16 pm Posted by : SAMAJA HITHAM

డాక్టర్ రఘు కుటుంబానికి సీపీఐ, ఏఐటీయూసీ నేతల పరామర్శ

News Image
డాక్టర్ రఘు కుటుంబానికి సీపీఐ, ఏఐటీయూసీ నేతల పరామర్శ

జగిత్యాల, సమాజహితం ప్రతినిధి : తెలంగాణ రక్షణ సేన కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ చిట్నేని రఘు మాతృమూర్తి పుష్పలత ఇటీవల మరణించగా సీపీఐ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, ఏఐటీయూసీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఏశమేని గణేష్ సోమవారం మెట్‌పల్లిలోని డాక్టర్ రఘు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా పుష్పలత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించినివాళులర్పించారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాతా వినయ్‌, మాజీ సర్పంచ్ ద్యావతి జంగ గంగా స్వామి లతో పాటు పలువురు పాల్గొన్నారు.
🏠 Home