🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 22 September 2026, 7:34 pm Posted by : SAMAJA HITHAM

గండి హనుమాన్ ఆలయంలో టెండర్లు

News Image
జగిత్యాల, సమాజహితం (సెప్టెంబర్ 22-09-2026): జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లోని ప్రసిద్ధ గండి హనుమాన్ ఆలయంలో వివిధ విక్రయాల నిర్వహణకు టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో విక్రం తెలిపారు. ఆలయ పరిధిలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, లడ్డూ, పులిహోర తదితరాల విక్రయాలు చేపట్టేందుకు ఈ నెల 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో టెండర్లు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెండర్లలో పాల్గొనే ఆసక్తి గల వ్యక్తులు రూ.20,000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని ఈవో సూచించారు. టెండర్ ద్వారా పొందే హక్కుల కాలపరిమితి 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత సమయానికి హాజరై టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని ఆలయ అధికారులు కోరారు.
🏠 Home