పోలీసులతో కలిసి ట్రాన్స్‌జెండర్ల విధులు..జగిత్యాలలో ప్రత్యేక బందోబస్తు!
జగిత్యాల జిల్లా, సెప్టెంబర్ 23 (సమాజహితం): గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో జగిత్యాల జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిమజ్జనానికి తరలివస్తున్న భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జగిత్యాల పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే ఈసారి జగిత్యాల పోలీస్ శాఖ వినూత్నంగా 17 మంది ట్రాన్స్‌జెండర్లను కూడా బందోబస్తు విధుల్లో భాగస్వాములను చేసింది. నిమజ్జన కార్యక్రమంలో భక్తుల రద్దీ, ట్రాఫిక్ నియంత్రణతో పాటు శాంతిభద్రతలను పర్యవేక్షిస్తూ వారు పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు.
గత ఏడాది కూడా ట్రాన్స్‌జెండర్లు బందోబస్తు విధుల్లో అద్భుతంగా సేవలందించారని పోలీస్ అధికారులు తెలిపారు. తమను సమాజంలో చిన్నచూపు చూసేవారు సైతం ఆశ్చర్యపడేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ.. ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు సహకరించారని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి బందోబస్తు విధుల్లో అవకాశం కల్పించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు ట్రాన్స్‌జెండర్లు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖ తమకు ఇచ్చిన ఈ గౌరవం, బాధ్యత మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించిందని వారు తెలిపారు.