🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 10:29 pm Posted by : SAMAJA HITHAM

భూముల రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

News Image
జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) :జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని, సర్వే నిర్వహిస్తున్న విధానాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్వే సమయంలో భూముల హద్దులు, భూ యజమానుల వివరాలు, అందుబాటులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి, భూములకు సంబంధించిన వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. రీ-సర్వే ద్వారా భూముల వివరాలు, సరిహద్దులకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోల్చుకోవాలని అధికారులకు తెలిపారు. సర్వే నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రీ-సర్వే పనులను సమన్వయంతో నిర్వహిస్తూ, ప్రక్రియ సజావుగా జరిగేలా సంబంధిత రెవెన్యూ, సర్వే అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన వివరాల పరిశీలనలో పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రీ-సర్వే ప్రక్రియను నిర్వహించాలని తెలిపారు. సర్వే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, నిర్దేశించిన విధానాల ప్రకారం పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహసీల్దార్, సంబంధిత అధికారులు, సర్వే అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home