ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా సాగు, తాగునీటి సరఫరాపై ముందస్తు చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగి సాగు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల సంరక్షణపై అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అదనపు కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం, వర్షపాతం, ఖరీఫ్ పంటల పరిస్థితి, యాసంగి సాగు ప్రణాళిక, ఉద్యాన పంటలు, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ప్రజారోగ్యం, గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి అక్టోబర్ 26 వరకు సాధారణ వర్షపాతం 3,794.8 మి.మీ కాగా వాస్తవంగా 2,982.1 మి.మీ నమోదైందని, సాధారణంతో పోలిస్తే 21 శాతం, గత ఏడాదితో పోలిస్తే 30 శాతం లోటు ఉందని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండలంలో 27 శాతం, కోరుట్లలో 22 శాతం, మేడిపల్లిలో 22 శాతం, మల్లాపూర్ లో 15 శాతం లోటు నమోదైనట్లు తెలిపారు. కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఖరీఫ్ లో 1,03,845 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా 72,210 ఎకరాల్లో వరి సాగు చేశారని, 455 ఎకరాల్లో నీటి ఒత్తిడి, 101 ఎకరాల్లో పంట ఎండిపోయిందని, అందులో కోరుట్ల మండలంలోనే 80 ఎకరాలు ఉన్నాయని తెలిపారు. ఎల్ నినో కారణంగా యాసంగిలో వరి సాగును 70,229 ఎకరాల నుంచి 29,918 ఎకరాలకు తగ్గించి మొక్కజొన్నను 21,693 నుంచి 29,276 ఎకరాలకు పెంచాలని, మొత్తం సాగు 93,218 నుంచి 62,904 ఎకరాలకు తగ్గుతుందని తెలిపారు. ఉద్యాన, ఆయిల్ పామ్, తక్కువ నీటి పంటలను ప్రోత్సహించాలని ఆదేశించారు. యాసంగిలో 377 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 495 మంది రైతులు 1,253 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని, 783.8 ఎకరాల్లో సూక్ష్మ సేద్య పరికరాల ఏర్పాటు పూర్తయినట్లు తెలిపారు. జిల్లాలో 246 చిన్న నీటి వనరుల సామర్థ్యం 2,412 ఎంసీఎఫ్టీ కాగా ప్రస్తుతం 1,116 ఎంసీఎఫ్టీ అందుబాటులో ఉందని, ఇది 46 శాతమని, కోరుట్ల ప్రాంతంలో భూగర్భ జలమట్టం 11 ఏళ్ల కనిష్టానికి చేరిందని అన్నారు. రానున్న 6 నెలల పాటు కొత్త బోర్లు వేయకుండా కఠినంగా అమలు చేయాలని, వీబీ-జీ రామ్ జీ పథకం కింద ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ పనులు గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పశుగ్రాసం 180 రోజులకు 0.491 లక్షల టన్నులు అవసరం కాగా 1.158 లక్షల టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. గ్రామీణ తాగునీరు రోజుకు 20,260 కిలోలీటర్లు అవసరం కాగా 12,900 మాత్రమే సరఫరా అవుతోందని, 7,360 కొరత ఉందని, మిషన్ భగీరథ పైప్ లైన్ సమస్యలను 45 రోజుల్లో పరిష్కరించాలని, కోరుట్ల, మేడిపల్లి మున్సిపాలిటీల పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో 4 డెంగ్యూ, 1 మలేరియా కేసు నమోదైందని తెలిపారు. గోదావరి పుష్కరాలు 2027కు కోరుట్ల పరిధిలో 38 లక్షల మంది భక్తులు వస్తారని, 2015లో 9.45 లక్షలు రాగా మల్లాపూర్ కు 1.25 లక్షల నుంచి 15 లక్షలు, ఇబ్రహీంపట్నం కు 8.20 లక్షల నుంచి 23 లక్షలకు పెరుగుతుందని తెలిపారు. మల్లాపూర్ లో వి.వి. రావుపేట, వల్గొండ, మొగిలిపేట, ఓబులాపూర్, కొత్త ధర్మారంపల్లి, పాత ధర్మారంపల్లి, ఇబ్రహీంపట్నం లో కోమటికొండాపూర్, ఎర్ధండి, ములరాంపూర్, బర్తీపూర్, వేములకుర్తి, రత్నాలమడుగు, ఫకీర్ కొండాపూర్, యమాపూర్ గ్రామాల్లో పుష్కర ఘాట్లు ప్రతిపాదించారని తెలిపారు. మొత్తం రూ.226.41 కోట్లు ప్రతిపాదించగా, మొదటి ప్రాధాన్యతకు రూ.206.42 కోట్లు, రెండో, మూడో ప్రాధాన్యత పనులకు రూ.19.99 కోట్లు, దేవాదాయకు రూ.20 కోట్లు, ఇరిగేషన్ కు రూ.38.39 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కు రూ.43.55 కోట్లు, ప్రజారోగ్యకు రూ.15 కోట్లు, ధర్మపురి మున్సిపాలిటీకి రూ.2 కోట్లు, పర్యాటకకు రూ.1 కోటి, ఆర్ అండ్ బీకి రూ.80 కోట్లు, విద్యుత్ కు రూ.6 కోట్లు ప్రతిపాదించారని తెలిపారు. విద్యుత్ శాఖ 32 పనులకు రూ.7.67 కోట్ల అంచనా ఉండగా రూ.2.09 కోట్లకు మాత్రమే అనుమతి వచ్చిందని తెలిపారు. పుష్కరాలకు మల్లాపూర్ లో 1,051 మంది, ఇబ్రహీంపట్నం లో 1,440 మంది చొప్పున మొత్తం 2,491 మంది పోలీసు సిబ్బంది అవసరమని తెలిపారు. మంజూరైన పనులను వెంటనే ప్రారంభించి, గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటలకు మంచి ధరలు ఉన్నా రానున్న వారాల్లో దిగుబడులు ఎక్కువ రావడంతో ధరలు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు మౌలిక సదుపాయాలు సిద్ధం చేసి, కనీస మద్దతు ధరకు కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. రెండో పంటగా వరి సాగు చేయకూడదనే విషయాన్ని రైతులకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. తక్కువ నీటి పంటలు రైతులు ఎంచుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసూనాంబ, ఆర్డీవో జీవాకర్ రెడ్డి, అగ్రికల్చరల్, హార్టికల్చర్, విద్యుత్, ఇరిగేషన్, వెటర్నరీ, మిషన్ భగీరథ, గ్రౌండ్ వాటర్, డీఆర్డీఏ, మున్సిపల్, పీఆర్, ఆర్ అండ్ బీ శాఖల జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.