🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 October 2026, 10:43 pm Posted by : SAMAJA HITHAM

విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం పై అవగాహన!

News Image
జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీసు శాఖ పనితీరు, వైర్ లెస్ సెట్ ద్వారా మాట్లాడే విధానం, పోలీసు లాకప్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసే విధానం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు, డయల్ 112 సేవలు, రిసెప్షనిస్ట్ పనితీరు, 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండే డిపార్ట్ మెంట్ పోలీసు డిపార్ట్ మెంట్ అని సూచించారు. పాత నేరస్తులను గుర్తుపట్టడానికి ఫింగర్ ప్రింట్ ద్వారా గుర్తించడం లాంటి వివిధ అంశాలపై, పోలీసు ఆయుధాల పనితీరు, సంఘవిద్రోహ శక్తుల చేతిలో చనిపోయిన పోలీసు అమరవీరుల గురించి, భరోసా సెంటర్, షీ టీమ్ పోలీసులు, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా పోలీసు స్టేషన్ అంటే ఏమిటి, అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని పని విధానం ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home