🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 11:41 pm Posted by : SAMAJA HITHAM

మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ తీరుకు నిరసనగా 22 మంది కౌన్సిలర్ల వాకౌట్

News Image
జగిత్యాల జిల్లా, మెట్ పల్లి, అక్టోబర్ 29 (సమాజహితం న్యూస్) : జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ సాధారణ కౌన్సిల్ సమావేశం గురువారం గందరగోళం మధ్య సాగింది. మున్సిపల్ చైర్మన్ లింబాద్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లతో కూడిన అఖిలపక్షం నిరసనకు దిగింది. చైర్మన్ ఒంటెద్దు పోకడలను నిరసిస్తూ.. మొత్తం 22 మంది కౌన్సిలర్లు సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలిపారు. కౌన్సిలర్ల ప్రమేయం లేకుండానే వార్డుల్లో అభివృద్ధి పనులు, మున్సిపల్ ఎజెండా అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని కౌన్సిలర్లు ఆరోపించారు. చైర్మన్ కు అనుకూలమైన వార్డులకే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ, మిగతా వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు.
🏠 Home