పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం లాంటిది - మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 29 (సమాజహితం న్యూస్) : పోక్సో చట్టం విద్యార్థులకు రక్షణ కవచం లాంటిదని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అజయ్ కుమార్ అన్నారు. మండల్ లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గురువారం సురక్షిత బచ్ పన్ అభియాన్ స్కీమ్ కింద జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల లోపు వయసున్న ప్రతి విద్యార్తిని, విద్యార్థులు పోక్సో చట్టం యొక్క నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలని సూచించారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ప్రభుత్వం రూపొందించిన చట్టాల రక్షణతో పాటూ, చట్టం యొక్క ప్రయోజనాల్ని పొందాలని సూచించారు. దగ్గరి బంధువుల నుండి గానీ, ఉపాధ్యాయుల నుండి గానీ వేధింపులు ఉన్నా కూడా, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 కి కూడా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ మాధవి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ దయ్య రాజారాం, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్ల రాజేందర్, న్యాయవాదులు కొండ ప్రవీణ్ కుమార్, కోటగిరి వెంకటస్వామి, ఆకుల సురక్ష, ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.కూలమైన వార్డులకే అభివృద్ధి నిధులు కేటాయిస్తూ, మిగతా వార్డులను నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు.