🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 11:18 pm Posted by : SAMAJA HITHAM

రామకృష్ణ నగర్‌లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమం!

News Image
రామకృష్ణ నగర్: రామకృష్ణ నగర్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిషోర్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నాయకులు, కార్యకర్తలతో కలిసి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ శ్రీనివాస్, దూడిమెట్ల సోమేష్ యాదవ్, సత్తిరెడ్డి, శ్యామ్, శరత్, స్వామి, పాల కనకయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు భాగస్వాములయ్యారు.
🏠 Home