మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం) : మెట్ పల్లి పట్టణంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, వైద్య సిబ్బంది హాజరు, మందుల లభ్యత తదితర అంశాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించి, మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యం కోసం వచ్చే ప్రజల పట్ల వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి రోగికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, ఆసుపత్రులలో పారిశుద్ధ్యం, రోగులకు అవసరమైన సౌకర్యాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఆర్డీఓ నరసింహారావు, కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.