🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 10:10 pm Posted by : SAMAJA HITHAM

దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందాం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

News Image
జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం) : దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిని స్మరించుకుందామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ ప్రతిజ్ఞలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను మరియు భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తున్నానని మరియు నా తోటి ప్రజల్లోకి ఈ సందేశాన్ని పంపడానికి నా వంతు కృషి చేస్తున్నానని ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి చరిత్రలో చిరస్మరణీయమన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్థానాలను విలీనం చేసి అఖండ భారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఆయన దూరదృష్టి, నాయకత్వ లక్షణాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ సేవలను స్మరిస్తూ వారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వేణు, సైదులు, శ్రీధర్, ఆర్ఎస్ఐ లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home