🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 10:13 pm Posted by : SAMAJA HITHAM

మెట్ పల్లి లో ఘనంగా ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవం!

News Image
- కార్మిక హక్కుల పరిరక్షణకు ఏఐటీయూసీ నిరంతర పోరాటం!
- జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్!

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 31 (సమాజహితం): భారతదేశ తొలి కార్మిక సంఘం ఏఐటీయూసీ 107వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెట్‌పల్లి పట్టణంలోని వెల్లుల్ల రోడ్డులో ఏఐటీయూసీ జెండాను జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎశమేని గణేష్ ఆవిష్కరించారు. అనంతరం కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడుఎశమేని గణేష్ మాట్లాడుతూ, భారతదేశంలో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం ఏఐటీయూసీ అని అన్నారు. ఏఐటీయూసీ నిర్వహించిన అనేక పోరాటాల ఫలితంగా కార్మికులకు అనేక చట్టాలు, హక్కులు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన వేతనాల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను హరించే విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి, కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26,000 చెల్లించాలని కోరారు. ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పండుగ సెలవులు, జాతీయ సెలవులు, మెటర్నిటీ సెలవులు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ తన పోరాటాలను మరింత ఉధృతం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎండి ఉస్మాన్,మెట్ పల్లి మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు లంక శ్రీకాంత్, యు. శ్రీనివాస్, సెంట్రింగ్ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ గద్దల బాలరాజు, పొట్ట ప్రసాద్,ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాతా వినయ్,ఓడల రాకేష్,చౌదరిశివకుమార్,గోవర్ధన్,మాతంగి శ్రావణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home