🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:12 pm Posted by : SAMAJA HITHAM

ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత

News Image
ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత

ఎండ్రీయాల్ గ్రామంలో ముగ్గురు ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం

ఎండ్రీయాల్ గ్రామానికి చెందిన ముగ్గురు ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్దేశంతో సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదును గ్రామ పంచాయతీ కార్యదర్శి చేతుల మీదుగా పోస్టాఫీస్ సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రెడ్డిగారి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, పోస్టాఫీస్‌లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలు కలిగిన ముగ్గురు బాలికల ఖాతాల్లో ఈ నగదును జమ చేయనున్నట్లు తెలిపారు. 2024 తర్వాత జన్మించిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఆధార్ కార్డులతో స్థానిక పోస్టాఫీస్‌ను సంప్రదించి తమ కుమార్తె పేరుతో ఖాతా ప్రారంభించుకోవాలని సూచించారు. ఆడపిల్లల విద్య, ఉన్నత భవిష్యత్తు, ఆర్థిక భద్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
🏠 Home