🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 9:53 pm Posted by : SAMAJA HITHAM

దత్తత వివాదానికి సామరస్య పరిష్కారం - జిల్లా యంత్రాంగం చొరవ

News Image
జగిత్యాల, నవంబర్ 06 (సమాజహితం): జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన దత్తతకు సంబంధించి తలెత్తిన వివాదాన్ని జిల్లా పరిపాలనా యంత్రాంగం ప్రత్యేక చొరవతో, మానవతా దృక్పథంతో సామరస్యపూర్వకంగా పరిష్కరించింది. చిన్నారి శ్రేయస్సు, భవిష్యత్తు భద్రతే ప్రధాన లక్ష్యంగా హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం 1956 ప్రకారం జగిత్యాల సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో బాలల సంక్షేమ అధికారుల సమక్షంలో దత్తత ప్రక్రియను చట్టబద్ధంగా పూర్తి చేశారు. దీంతో చిన్నారి కుటుంబ వాతావరణంలో భద్రంగా పెరిగేందుకు, విద్య, చట్టపరమైన హక్కులు పొందేందుకు మార్గం సుగమమైంది. వివాదం పరిష్కారం కావడంతో గతంలో దాఖలు చేసిన రిట్ అప్పీల్ ఉపసంహరణకు ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా యంత్రాంగం తెలిపారు.
🏠 Home