🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 4:08 pm Posted by : SAMAJA HITHAM

గాంధారి మండలంలో దారుణ హత్య.. పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వచ్చిన యువతి హతం!

News Image
గాంధారి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో కలకలం రేపిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పత్రికలు అందించేందుకు సొంతూరికి వచ్చిన ఓ యువతి గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గాంధారి మండల కేంద్రంలోని అంగడి బజార్ సెల్ టవర్ సమీపంలో నివాసముండే సిక్కు మతానికి చెందిన ఆర్.సీ. కౌర్ జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తోంది. ఇటీవల ఆమెకు వివాహ సంబంధం కుదరడంతో, తన పెళ్లి శుభలేఖలను బంధువులు, పరిచయస్తులకు అందించేందుకు శుక్రవారం స్వగ్రామమైన గాంధారికి వచ్చింది.

ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సెల్ టవర్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను హత్య చేసినట్లు ఎస్సై మహేందర్ వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి విచారణ చేపట్టారు.

యువతి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
🏠 Home