🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 4:10 pm Posted by : SAMAJA HITHAM

భారతీయ విద్యార్థి మోర్చా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్, కో-కన్వీనర్‌గా భానుప్రసాద్ నియామకం

News Image
కామారెడ్డి: బాంసెఫ్ అనుబంధ విద్యార్థి సంఘమైన భారతీయ విద్యార్థి మోర్చా (BVM) కామారెడ్డి జిల్లా నూతన కమిటీని ప్రకటించింది. బీవీఎం రాష్ట్ర అధ్యక్షులు భూంపల్లి రవితేజ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా నాయకుల సమక్షంలో నూతన కమిటీ నియామకం చేపట్టారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా రోహిత్‌ను, జిల్లా కో-కన్వీనర్‌గా భానుప్రసాద్‌ను నియమించారు. ఈ నియామకంలో బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు దుబాసి నరేందర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. “నా చదువు – నా సమాజం కోసం” అనే నినాదంతో భారతీయ విద్యార్థి మోర్చా విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. సమాజంలోని అసమానతలపై విద్యార్థులను చైతన్యపరచడంతో పాటు, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను విద్యార్థులకు చేరవేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీవీఎం నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు.

నూతనంగా జిల్లా కన్వీనర్‌, కో-కన్వీనర్‌లుగా బాధ్యతలు చేపట్టిన రోహిత్, భానుప్రసాద్‌లకు నాయకులు అభినందనలు తెలియజేశారు.

అనంతరం నూతన బాధ్యతలు స్వీకరించిన రోహిత్, భానుప్రసాద్ మాట్లాడుతూ తమపై నమ్మకంతో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బీవీఎం కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్, కో-కన్వీనర్ భానుప్రసాద్, కమిటీ సభ్యులు సతీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home