🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 10:15 am Posted by : SAMAJA HITHAM

వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతల స్వీకరణ

News Image
హైదరాబాద్, సమాజహితం : తెలంగాణ వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనలాంటి ప్రజల్లో ఉంటూ పనిచేస్తున్న నాయకులకు తగిన గుర్తింపు, ప్రోటోకాల్ ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు ఈ అవకాశం కల్పించారని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెడ్డి, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ, వెలమ సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వెలమ సామాజిక వర్గంలోనూ ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు ఉన్నారని, గత ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోలేదని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ సామాజిక వర్గాన్ని గుర్తించి తొలిసారిగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా సామాజిక వర్గంలోని వెనుకబడిన వారి అభ్యున్నతికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత మూడు సంవత్సరాలుగా తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేశానని వివరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని, వెలమ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మరింత కష్టపడి పనిచేస్తానని జువ్వాడి నర్సింగరావు స్పష్టం చేశారు.
🏠 Home