🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 11:46 pm Posted by : SAMAJA HITHAM

గ్రీవెన్స్ డే లో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

News Image
జగిత్యాల, నవంబర్ 10 (సమాజహితం ): ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి, ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి, వినతులు స్వీకరించి, క్షేత్ర స్థాయిలో పరిశీలించి, వేగంగా స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడమే లక్ష్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
🏠 Home