దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణానికి కరపూజా కార్యక్రమం
ఎండ్రియాల్: గ్రామంలో దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణం కోసం న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ (దేవి శక్తిక్షేత్రం), ఎండ్రియాల్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కరపూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రావు, ప్రధాన కార్యదర్శి రెడ్డిగారి మహిపాల్ రెడ్డి నాయకత్వం వహించారు. యూత్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రామస్వామి, వెంకటరమణ, కృష్ణకర్ రావు, మనోహర్ రెడ్డి, కిషన్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని కరపూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కోర్ని నర్సింలు, ఉపసర్పంచ్ గడ్డం నర్సారెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి సాహిత్య, గ్రామ పరిపాలన అధికారి మధు, గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
దుర్గాభవాని మాత ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆకాంక్షను ఈ సందర్భంగా గ్రామస్థులు వ్యక్తం చేశారు. గ్రామ ప్రజల సహకారం, యువత ఐక్యతతో కరపూజా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.