ఏండ్రియాల్‌లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ
తాడ్వాయి: తాడ్వాయి మండలంలోని ఏండ్రియాల్ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు, తొలి స్వాతంత్ర్య పోరాట యోధుల్లో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
రెడ్డి సంఘం అధ్యక్షుడు బాణాల పెద్ద గంగారెడ్డి, కార్యదర్శి రెడ్డి గారి సిద్ధిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి త్యాగాలు, పోరాట పటిమ, దేశభక్తి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన చరిత్రను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, గ్రామంలో విగ్రహ ఏర్పాటు ద్వారా ఆయన వీరోచిత పోరాటాన్ని భవిష్యత్ తరాలకు గుర్తుచేసే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షుడు బాణాల పెద్ద గంగారెడ్డి, కార్యదర్శి రెడ్డి గారి సిద్ధిరామిరెడ్డి, రెడ్డి సంఘం సభ్యులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి, జీపీఓ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.