🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 8:53 am Posted by : SAMAJA HITHAM

కొమరబండలో 13 మందికి నూతన పింఛన్లు పంపిణీ

News Image
కొమరబండలో 13 మందికి నూతన పింఛన్లు పంపిణీ

అర్హులైన నిరుపేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం: సర్పంచ్ పద్మ గోపాల్

షాబాద్:నవంబర్:13, సమాజహితం: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా షాబాద్ మండలం కొమరబండ గ్రామానికి చెందిన 13 మంది అర్హులకు నూతన పింఛన్లు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా షాబాద్‌లోని ఎం.ఎస్. గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేతుల మీదుగా లబ్ధిదారులకు నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పద్మ గోపాల్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక చొరవ తీసుకున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా కృషి చేశామని పేర్కొన్నారు. 13 మందికి నూతన పింఛన్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కాలె యాదయ్యకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
🏠 Home