🏠 www.samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 November 2026, 9:16 am Posted by : SAMAJA HITHAM

స్కానింగ్ సెంటర్లలో జిల్లా ఉప వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు

News Image
స్కానింగ్ సెంటర్లలో జిల్లా ఉప వైద్యాధికారి ఆకస్మిక తనిఖీలు - డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి

జగిత్యాల, నవంబర్ 13 (సమాజహితం): జగిత్యాల పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లను బుధవారం జిల్లా ఉప వైద్యాధికారి, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (పీ సీ పీ ఎన్ డీ టీ యాక్ట్ - 1994) ప్రకారం గర్భస్థ శిశువు ఆడ లేదా మగ అని నిర్ధారించి వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు, స్కానింగ్ సెంటర్లలో వినియోగిస్తున్న అల్ట్రాసౌండ్ యంత్రాలు, వైద్యుల అర్హత ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత అధికారులు మంజూరు చేసిన అనుమతులు, దరఖాస్తుల ప్రకారం ఉన్నాయా లేదా అని పరిశీలించారు, ప్రతి నెల 5వ తేదీలోపు ఫారం - ఎఫ్ వివరాలను సంబంధిత పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు, ఆన్ లైన్ లో నమోదు చేసిన ఫారం - ఎఫ్ వివరాలు, ఆఫ్ లైన్ రికార్డుల్లోని వివరాలు ఒకే విధంగా ఉండాలని సూచించారు, స్కానింగ్ సెంటర్లలో పేషెంట్లకు స్పష్టంగా కనిపించే విధంగా ఇక్కడ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయబడదు, లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోబడతాయి అనే హెచ్చరిక బోర్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని తెలిపారు, పీ సీ పీ ఎన్ డీ టీ చట్ట నిబంధనలను ఉల్లంఘించి గర్భస్థ శిశు లింగ నిర్ధారణకు పాల్పడిన వారిపై జరిమానాతో పాటు చట్టప్రకారం జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు, లింగ నిర్ధారణను ప్రోత్సహించే వ్యక్తులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వైద్యుల వైద్య రిజిస్ట్రేషన్ రద్దుకు సైతం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు, తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన సందర్భాల్లో సంబంధిత వారికి నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని డాక్టర్ జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు, ఈ తనిఖీల్లో ఇన్ ఛార్జి డెమో ఏనుగంటి రాజేశం, జూనియర్ అసిస్టెంట్ వి. సాగర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home