నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్*
నేర నియంత్రణ, శాంతి భద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, నవంబర్ 13 (సమాజహితం): సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి నేరాల నివారణకు ప్రాధాన్యత ఇస్తూనే, జరిగిన నేరాలను త్వరితగతిన ఛేదించి బాధితులకు న్యాయం అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్ పీ అశోక్ కుమార్ ఐ పీ ఎస్ సూచించారు, ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ క్రైమ్ మీటింగ్ లో డీ ఎస్ పీ లు, సీ ఐ లు, ఎస్ ఐ లు పాల్గొన్నారు, ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాల పరిస్థితి, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, చార్జ్ షీట్లు, నేర నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల నిర్వహణ, సైబర్ నేరాలు, మహిళలు, చిన్నారుల భద్రత తదితర అంశాలపై ఎస్ పీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు, జిల్లాలో నేరాల నియంత్రణ, విచారణా వ్యవస్థను వేగవంతం చేయడం, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడం, ప్రతి కేసు విచారణ నాణ్యతతో పాటు సాక్ష్యాధారాల సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు, సీ సీ టీ ఎన్ ఎస్ అప్ డేషన్, ఈ - సాక్ష్య, ఐ ఆర్ ఏ డీ అప్లికేషన్ల వినియోగం, వాటి అప్ డేషన్ పై సమీక్షించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని పోలీస్ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు, పెండింగ్ కేసులను ప్రాధాన్యతగా తీసుకొని కోర్టుల్లో కన్విక్షన్ రేట్ పెంచేలా కృషి చేయాలన్నారు, మహిళా భద్రత, మత్తుపదార్థాల నివారణ, చోరీలు వంటి అంశాలపై క్షుణ్ణంగా విశ్లేషించారు, ప్రతి స్టేషన్ లో విజబుల్ పోలీసింగ్ పెంచాలని, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి నమ్మకం పెంచేలా ప్రవర్తించాలని సూచించారు, సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజల్లో అవగాహన కల్పించడంలో సైబర్ టీములు చురుకుగా పనిచేయాలని సూచించారు, నేర నియంత్రణలో భాగంగా సొసైటీ ఫర్ పబ్లిక్ సేఫ్టీ లో భాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో, గ్రామాలలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు, ముఖ్యంగా పోక్సో, గ్రేవ్, నాన్ - గ్రేవ్, ఎస్ సీ / ఎస్ టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి కోర్టుల్లో చార్జ్ షీట్లు సకాలంలో దాఖలు చేయాలని సూచించారు, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు, నాన్ బెయిలబుల్ వారెంట్లను ఒక్కొక్కటిగా పరిశీలించి, వాటి అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ ఎం - రాహత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఈ పథకం అమలులో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు, ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబరుస్తూ, ఫంక్షనల్ వర్టికల్స్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సిబ్బందిని, నేరస్తులకు శిక్ష పడేలా కేసుల్లో సమర్థవంతమైన దర్యాప్తు చేసి కోర్టుల్లో నేర నిర్ధారణకు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందిని గుర్తించి రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు, ఈ సమావేశంలో అదనపు ఎస్ పీ చేతన్ నితిన్ ఐ పీ ఎస్, డీ ఎస్ పీ లు పురుషోత్తం రెడ్డి, రాములు, రవి కుమార్, ఇన్ స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, రామ్ నరసింహా రెడ్డి, సుధాకర్, సురేష్ బాబు, శ్రీనివాస్, తిరుపతి, కరుణాకర్, రాజ్ కుమార్, వేణు, సైదులు, ఎస్ ఐ లు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.