పోగొట్టుకున్న పర్సు అప్పగించి.. నిజాయితీ చాటుకున్న తొంట వెంకటేష్!

రూ.3,540 నగదు, ఆధార్ కార్డుతో సహా మహిళకు తిరిగి అందజేత
వెంకటేష్ నిబద్ధతకు ఎస్సై విజయ్ కుమార్ ప్రశంసలు..శాలువాతో ఘన సన్మానం
షాబాద్, నవంబర్ 19 (సమాజహితం): నిజాయితీకి డబ్బుతో వెలకట్టలేమని, మానవత్వానికి మించిన సంపద మరొకటి లేదని షాబాద్ గ్రామానికి చెందిన తొంట వెంకటేష్ నిరూపించారు. రోడ్డుపై దొరికిన పర్సును తనది కానప్పుడు తనకెందుకనే బాధ్యతతో పోలీసులకు అప్పగించి ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపిన నిజాయితీ స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
షాబాద్ మండలంలోని దామాలపల్లి గ్రామానికి చెందిన ఇటిక యాదమ్మ షాబాద్ బస్టాండ్ సమీపంలో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో నగదు, ఆధార్ కార్డు, ఇతర ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన తొంట వెంకటేష్‌కు పర్సు కనిపించడంతో వెంటనే స్పందించి షాబాద్ ఎస్సై విజయ్ కుమార్‌కు అప్పగించారు.
పర్సులోని ఆధార్ కార్డు ఆధారంగా పోలీసులు యాదమ్మ వివరాలను గుర్తించి ఆమెకు సమాచారం అందించారు. అనంతరం పర్సును పరిశీలించి అందులో ఉన్న రూ.3,540 నగదుతో పాటు ఆధార్ కార్డు, ఇతర పత్రాలను సురక్షితంగా తిరిగి అప్పగించారు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి అందడంతో యాదమ్మ సంతోషం వ్యక్తం చేశారు.
నిజాయితీకి సముచిత గౌరవం
తనకు దొరికిన పర్సును ఏమాత్రం స్వార్థానికి తావులేకుండా పోలీసులకు అప్పగించిన తొంట వెంకటేష్‌ను ఎస్సై విజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. డబ్బు ఆశించకుండా బాధ్యతతో వ్యవహరించిన వెంకటేష్ నిజాయితీ అందరికీ ఆదర్శమని కొనియాడారు.
ఈ ఘటనతో తొంట వెంకటేష్‌పై గ్రామస్థులు, స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పోగొట్టుకున్న సొత్తును తిరిగి అందించడం చిన్న విషయంగా కనిపించినా.. అందులో దాగి ఉన్న నిజాయితీ, మానవత్వం ఎంతో గొప్పవి. ఇలాంటి వ్యక్తులే సమాజానికి నిజమైన ఆదర్శమని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.