మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా!
మెట్‌పల్లి, సెప్టెంబర్ 05 (సమాజహితం) : విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మెట్‌పల్లిలో ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపడతామని, విద్యార్థులకు స్కూటీలు అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని ఎమ్మెల్యే విమర్శించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు నష్టం కలిగించే GO 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మొండివైఖరి వీడి విద్యార్థులకు అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ...