ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 09 (సమాజహితం): గత రెండు రోజులుగా తెలంగాణ శాసనసభ, శాసనమండలి వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆడుతున్న కపట నాటకాలను యావత్ తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చట్టసభల సమావేశాలు ప్రారంభమవుతున్నాయంటే తమ బతుకులు మారేలా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతుందని తెలంగాణ ప్రజలు, వివిధ వర్గాల ప్రజానీకం ఆశగా ఎదురుచూస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆశలను వమ్ము చేస్తూ, అసెంబ్లీని ఈ రెండు పార్టీలు తమ వ్యక్తిగత దూషణలకు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న నాటకీయ రాజకీయ పరిణామాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం బీజేపీ...