బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్!

మెట్‌పల్లి, సెప్టెంబర్ 09 (సమాజహితం): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేతశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయనకు హాని కలిగించేలా ప్రజలను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులు మెట్‌పల్లి సీఐ గారికి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఒక మీడియా కార్యక్రమంలో ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి శ్రీ కేసీఆర్ గారిపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా “కేసీఆర్ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ.. అందుకే అతని చావును కోరుకుంటున్నాం.. అందుకే...