22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి
22-ఏ భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ కొడిమ్యాల, సెప్టెంబర్ 10 (సమాజహితం): మండలంలోని సుమారు 24 గ్రామపంచాయతీల పరిధిలో వందల ఎకరాల భూములను 22-ఏ జాబితాలో చేర్చడంతో రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం కొడిమ్యాల తహసీల్దార్‌కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 22-ఏ సమస్యను అధికారులు తక్షణమే పరిశీలించి, అర్హత ఉన్న భూములను జాబితా నుంచి తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షైన్ మల్లేశం, మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి, మండల కార్యవర్గ...