నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె

నేటి నుంచి రైస్ మిల్లర్ల నిరవధిక సమ్మె – ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిపివేతతో ఆర్థిక భారం.. – సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగింపు జగిత్యాల, (సమాజహితం): జిల్లాలో పారా బాయిల్డ్ రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు జగిత్యాల జిల్లా పారా బాయిల్డ్ రైస్ ఇండస్ట్రీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకటించింది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణలో జాప్యం, పెండింగ్ బిల్లులు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, మిల్లింగ్ ప్రక్రియలోని సమస్యలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మిల్లర్లు తెలిపారు. గత రెండు నెలలుగా ఎఫ్‌సీఐ బియ్యం సేకరణ నిలిచిపోవడంతో మిల్లుల్లో బియ్యం...