వినాయక మండపాల నిర్వాహకులకు ఇబ్రహీంపట్నం పోలీసుల సూచన!
జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): బండ లింగాపూర్ గ్రామంలో ఈరోజు ఎస్సై నవీన్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కనుగొందుల లక్ష్మీ సంజీవ్ అధ్యక్షతన వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకుల కు పోలీసుశాఖ సూచనలు చేసారు..నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఇబ్రహీంపట్నం పోలీసులు విజ్ఞప్తి చేశారు. గణేష్ మండపాల నిర్వాహకులు పోలీసుశాఖ పోర్టల్‌లో ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని, ప్రజా రవాణా, అంబులెన్స్‌లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అనుమతులు, విద్యుత్ శాఖ అనుమతి పొందిన తర్వాతే విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి...