నూతన బాధ్యతలు పొందిన NSUI నాయకులకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి అభినందనలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం): ఇటీవల NSUI రాష్ట్ర కార్యవర్గంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు పోల్కం శివ ఆధ్వర్యంలోని NSUI బృందం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నదయ్యాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నదయ్యా నూతన బాధ్యతలు పొందిన నాయకులను అభినందించారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ విలువైన సూచనలు, ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేంద్ర రెడ్డి, వెంపెట్ ఉపసర్పంచ్ అల్లూరి సురేందర్, NSUI మెట్‌పల్లి పట్టణ...