ముందస్తుగా ఇంజనీరింగ్ డే వేడుకలు
జగిత్యాల/ మెట్‌పల్లి, సెప్టెంబర్ 11 ( సమాజహితం ) : మెట్‌పల్లి పట్టణంలో జిందాల్ పాంథర్ స్టీల్ కంపెనీ మీనాక్షి ట్రేడర్ వారి తరపున మెట్‌పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ముందస్తుగా శుక్రవారం ఇంజనీర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శశి కుమార్, ఉపాధ్యక్షులు గౌతం, కార్యదర్శి శ్యామ్ సుందర్, సహ కార్యదర్శి సంకీర్త్ గౌడ్, కోశాధికారి సాయి కిరణ్, ఇంజనీర్లు అశోక్, మసూద్ రెహమాన్, వంశీ, గిరిధర్, రోహన్, పవన్, చరణ్, రవీందర్,...