వెల్లుల్ల జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు టీకాలు!

జగిత్యాల, సెప్టెంబర్ 11 (సమాజహితం ప్రతినిధి ) : వెల్లుల్ల గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీకాలు అందించారు. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులకు అవసరమైన ఇంజెక్షన్లు వైద్యాధికారి గజాల పర్యవేక్షణలో వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గూడూరు తిరుపతి, పంచాయతీ కార్యదర్శి నారాయణ, ఏఎన్‌ఎం సువర్ణ, పాఠశాల హెచ్‌ఎం ఆశలత పాల్గొన్నారు. అలాగే ఉపాధ్యాయులు జగన్, స్వప్న, వసంత, వినయ, లావణ్య, సుమిత్ర, సరస్వతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పాఠశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పాఠశాల స్థాయిలో టీకాల...