జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా పూడుకారపు నవీన్ రెడ్డి
జగిత్యాల ప్రతినిధి, (సమాజహితం): జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ ఎన్నికలు బుధవారం మెట్ పల్లి లో ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో పూడుకారపు నవీన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో విజయం సాధించి జగిత్యాల జిల్లా పౌల్ట్రీ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి చెందిన ప్రతినిధులు, సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో నవీన్ రెడ్డికి సభ్యుల నుంచి విశేష మద్దతు లభించడంతో ఆయన ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నవీన్ రెడ్డికి పౌల్ట్రీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సభ్యులు, అభిమానులు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకంతో మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు...