మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి

మెట్ పల్లిలో ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్ట్ ఇవ్వాలి మున్సిపల్ చైర్‌పర్సన్‌ మైలారపు లింబాద్రికి నియోజకవర్గ సాధన సమితి వినతి! జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 16 (సమాజహితం): మెట్ పల్లి రైల్వే స్టేషన్‌ గుండా వెళ్లే ప్రతి ఎక్స్‌ప్రెస్ రైలుకు మెట్ పల్లి స్టేషన్ లో హాల్ట్ కల్పించాలని కోరుతూ మెట్ పల్లి నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు. మెట్ పల్లి రెవెన్యూ డివిజన్ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు నిలుపుదల కల్పించాల్సిన అవసరం ఉందని వారు కోరారు. మెట్ పల్లి పరిసర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు, ప్రజలు...