76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి
76 జీఓ అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇవ్వాలి. రామగుండంలో 1×800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించాలి: ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ గోదావరిఖని, (సమాజహితం) : సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను త్వరితగతిన అమలు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ కోరారు. తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం సింగరేణి కార్మికుల సమస్యలను ప్రస్తావించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.. 76 జీఓను అమలు చేసి సింగరేణి కార్మికులకు పట్టాలు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా సింగరేణి మారు పేర్ల సమస్యపై కమిటీ ఏర్పాటు చేసి, అర్హులకు...