వినాయక నిమజ్జనం వేడుకల్లో ఆరోగ్యమే మహాభాగ్యం: వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి
- వినాయక నిమజ్జనం వేడుకల్లో ఆరోగ్యమే మహాభాగ్యం - ప్రజలు, నిర్వాహకులు ప్రత్యేక ఆరోగ్య - భద్రతా జాగ్రత్తలు పాటించాలి - అధిక శబ్దంతో DJలు వినియోగించవద్దు: మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి మెట్పల్లి: వినాయక నిమజ్జనం సందర్భంగా మెట్పల్లి మండల ప్రజలు భక్తిశ్రద్ధలతో పాటు ఆరోగ్య, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని మండల వైద్యాధికారి డాక్టర్ ఎల్లాల అంజిత్ రెడ్డి సూచించారు. నిమజ్జనం కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ప్రజారోగ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కలుషిత నీరు, ఆహారం, దోమల వ్యాప్తి, అంటువ్యాధులు మరియు నీటిలో ప్రమాదాల...