వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం హైదరాబాద్, సెప్టెంబర్ 26 (సమాజహితం): తెలంగాణ వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు వీరనారి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీమతి సూరేపల్లి నంద, జస్టిస్ నందికొండ నర్సింగరావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ చేసిన పోరాటాన్ని, ఆమె చూపిన ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగుతున్న ప్రజా జీవిత...