గ్రీవెన్స్ డే లో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, అక్టోబర్ 26 (సమాజహితం న్యూస్) : గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను పరిశీలించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 15 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పోలీసు స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు...