ఎంప్లాయిస్ యూనియన్ మెట్ పల్లి నూతన డిపో కమిటీ నియామకం!

జగిత్యాల, మెట్ పల్లి, అక్టోబర్ 26 ( సమాజహితం న్యూస్ ) : ఎంప్లాయిస్ యూనియన్ మెట్ పల్లి నూతన డిపో కమిటీ నియామకం జరిగినట్లు నాయకులు తెలిపారు. సోమవారం మెట్ పల్లిలో ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ అధ్యక్షులు ఎల్. ప్రకాష్, రీజనల్ కార్యదర్శి కొమ్మ కొమురయ్య యాదవ్, రీజనల్ కమిటీ మెంబర్ గణపతి పాల్గొని, మెట్ పల్లి మండల ఏఐటీయూసీ ఇంచార్జి ఎండి ఉస్మాన్ అధ్యక్షతన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా ఎండి ఉస్మాన్, ముఖ్య సలహాదారుగా ఏఎస్ చారి, అధ్యక్షుడిగా జేపీ రెడ్డి, డిపో...