ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 26 (సమాజహితం న్యూస్) : ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారని తెలిపారు. ప్రజల నుండి అందుతున్న ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా తీసుకొని సంబంధిత సమస్యపై సమగ్ర విచారణ జరిపి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని...