భూముల రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) :జిల్లాలో జరుగుతున్న రీ-సర్వే పనులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలో నిర్వహిస్తున్న భూముల రీ-సర్వే ప్రక్రియను మంగళవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని, సర్వే నిర్వహిస్తున్న విధానాన్ని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భూముల రీ-సర్వే ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సర్వే సమయంలో భూముల హద్దులు, భూ యజమానుల వివరాలు, అందుబాటులో ఉన్న భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సర్వే ప్రక్రియలో...