ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా సాగు, తాగునీటి సరఫరాపై ముందస్తు చర్యలు చేపట్టాలి - జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాసంగి సాగు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాల సంరక్షణపై అధికారులు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, అదనపు కలెక్టర్ తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం, వర్షపాతం, ఖరీఫ్ పంటల పరిస్థితి, యాసంగి సాగు ప్రణాళిక, ఉద్యాన పంటలు, తాగునీటి సరఫరా, పశుగ్రాసం, ప్రజారోగ్యం, గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. జిల్లా...