విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం పై అవగాహన!

జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : పోలీసు అమరవీరుల సంస్మరణలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై, పోలీసు శాఖ పనితీరు, వైర్ లెస్ సెట్ ద్వారా మాట్లాడే విధానం, పోలీసు లాకప్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ విధానం, సీసీ కెమెరాల పనితీరు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేసే విధానం, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే నష్టాలు, డయల్ 112 సేవలు, రిసెప్షనిస్ట్ పనితీరు, 24 గంటలకు ప్రజలకు అందుబాటులో ఉండే డిపార్ట్ మెంట్ పోలీసు...