రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 27 (సమాజహితం న్యూస్) : రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించి, వారి ప్రాణాలను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం రహత్ పథకంపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లా పరిధిలో మొత్తం 30 ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అర్హత నిబంధనలకు అనుగుణంగా రూ.1.5 లక్షల వరకు గరిష్టంగా ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే...